ప్రైవేట్ కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనాలు తక్షణమే చెల్లించాలి: శంకర్ గౌడ్

పి శంకర్ గౌడ్

హైదరాబాద్: ప్రభుత్వ వైద్యశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ డాక్టర్లకు గత నాలుగు నెలుగా వేతనాలు చెల్లంచక పోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వైద్యులు ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారికి మనవి చేస్తున్నాము వెంటనే కాంట్రాక్ట్ వైద్యుల నాలుగు నెలల వేతనాలు చెల్లించగలరని ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు పి శంకర్ గౌడ్ కోరుచున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధిని నివారించడంలో, కరోనా రోగులకు చికిత్సను అదించడంలో కుటుంబ సభ్యులను వదిలేన 24 గంటలు పనిచేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి కాంట్రాక్ట్ పద్దతిలో పని చేసి వారికి గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడం చాలా దారుణమైన విషయం కావున పభుత్వం వెంటనే స్పందించి నాలుగు నెలల వేతనం చెల్లించగలరని ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది .