రోడ్ విస్తరణ, జంక్షన్స్ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి

మహబూబ్నగర్: మహబూబ్ నగర్ పట్టణాభివృద్ధిలో భాగంగా చేపట్టిన రోడ్ విస్తరణ, జంక్షన్స్ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయుటకు సంబంధిత శాఖల అధికారులు సమిష్టిగా కలిసి పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు. గురువారం అడిషనల్ కలెక్టర్ చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా చేస్తున్న జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులను సంబంధిత శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని, ఏ శాఖకు అప్పజెప్పిన పనులను ఆయా శాఖల వారు త్వరగా పూర్తి చేయుటకు అందరు సమిష్టిగా కలిసి పనిచేయాలని, ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్ల పైన ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు గురి అవుతున్నారని, ఇబ్బందులను తొలగించుటకు గుంతలను పూడ్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహబూబ్నగర్ పట్టణాన్ని మంచి టౌన్ తీర్చిదిద్దేందుకు చేస్తున్న అభివృద్ధి పనులను అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ట్రాన్సఫార్మర్లు, పోల్స్ షిఫ్టింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, ఈ పనులు పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్కరు 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం జేఎన్టీయూ స్పెషల్ టీం మహబూబ్నగర్ పట్టణాన్ని సందర్శించారు. సందర్శనలో భాగంగా పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, గడియారం చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా, వన్ టౌన్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ చౌరస్తా, న్యూ టౌన్ చౌరస్తా, మెట్టుగడ్డ చౌరస్తా లో జరుగుతున్న జంక్షన్ల పనులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి పరిశీలించారు. ఈ జంక్షన్ల నిర్మాణం వలన భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా నిర్మాణాలు చేపట్టేందుకు సంబంధిత అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మునిసిపల్ కమీషనర్ సురేందర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, నేషనల్ హైవే అధికారులు, ఇంజినీర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.