జాతీయ అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా అమరుల స్థూపం వద్ద శ్రద్దాంజలి

మహబూబ్ నగర్: జాతీయ అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో అమరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్ రావు. శుక్రవారం అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అమరులకు శ్రద్దాంజలి ఘటించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ సంపదలైన అడవులను సంరక్షణ మరియు స్మగ్లింగ్  ఆరికట్టడంలో అసువులు బాసి అమరులైన అటవీ అధికారులను ఈసందర్బంగా స్మరించు కోవాలని, అడవుల్లో పగలు, రాత్రి పని చేస్తూ అటవీ సంపదను కాపాడుతున్న అధికారులు, సిబ్బందికి అవసరానికి ఉపయోగించే విధంగా జిల్లా స్థాయిలో ఒక నిధిని ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా అటవీ శాఖ అధికారి గంగారెడ్డి మాట్లాడుతూ జాతీయ అటవీ సంపదను సంరక్షణకై మన విధి నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా బాగా పని చేయాలని తెలుపుతూ, అటవీ అమరులకు శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం అటవీశాఖ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ రెంజ్ ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.