భారత ఆర్థిక మంత్రికి డీకే అరుణ పుట్టినరోజు శుభాకాంక్షలు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను భారతీయ జనతా పార్టీ మహిళా నేత డీకే అరుణ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి కలిసి మంత్రికి స్వయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ అని కొనియాడారు. సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రిస్థాయికి చేరిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్‌ అని పొగిడారు. అందునా.. పూర్తిస్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వశాఖను చేపట్టిన తొలి మహిళ నిర్మలనే కావడం విశేషం అని శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు.