ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

మహబూబ్నగర్: శుక్రవారం జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, టిఎస్ఈడబ్ల్యూఐడిసి కార్యాలయ ఈ-ఆఫీస్ విధానాన్ని కలెక్టరేట్ ఎన్ఐసిలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ యస్.వెంకట్ రావు. ఈ-ఆఫీస్ ప్రారంభించిన అనంతరంకలెక్టర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ శాఖలో మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదటగా ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం జరిగినదని, ఈ విధానం ద్వారా పారదర్శకత, గోప్యత, పేపర్ వాడకం లేకుండా ఫైలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని, ఈ- ఆఫీస్  విధానం వల్ల పారదర్శకతతో పాటు, ఫైల్ క్లియరింగ్  త్వరగా అవుతుందని, పాత తేదీలతో ఫైలు పంపించేందుకు అవకాశం లేదని, అంతేగాక ఫైలు మిస్ కావటానికి అవకాశం ఉండదని, ఏ ఫైల్ ఎక్కడ ఉందో వెంటనే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని, ముఖ్యంగా ఫైల్ గోప్యతకు భంగం కలగకుండా ఉంటుందని తెలిపారు. అంతేకాక ఈ -ఆఫీస్ విధానం వల్ల వేల ఫైళ్లు  కంప్యూటర్ లో నిక్షిప్తం చేసుకోవచ్చని, మ్యానువల్ విధానం వల్ల ఎక్కడికి వెళ్లిన ఫైళ్ళను భౌతికంగా తీసుకువెళ్లి పరిష్కరించాల్సి ఉంటుందని, అదే ఈ – ఆఫీస్ విధానం వల్ల ఫైళ్లు మోసుకు వెళ్లాల్సిన అవసరం లేదని, అత్యవసర పరిస్థితుల్లో అయినా వెంటనే ఫైళ్లను క్లియర్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఈఈ గురుభాగ్యం, రాములు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.