కలల రాజకుమారుడు కథలేవీ?

(బిఆర్పీఆర్) ఒకప్పుడు పత్రికల రీడర్ షిప్ ఎక్కువగా ఉండేది…ఒక మ్యాగజైన్ లో వస్తున్న సీరియల్ లు చదువాలని అప్పటి జనరేషన్ స్త్రీలు ఆతృత పడేవారు… ఇప్పటిలా ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు అప్పుడు ఉండేవారు కాదు! పుస్తకాల పిచ్చి విపరీతంగా ఉండేది! ఆ ట్రెండ్ ని కోడూరు కౌసల్య దేవీ, యద్దనపూడి సులోచన రాణి అందిపుచ్చుకోవడం తో నవలలు కుప్పలు తెప్పలుగా అమ్ముడుపోయేవి! మ్యాగజైన్ ల సర్క్యులేషన్ కూడా విపరీతంగా పేరిగేది! ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని ఆ ఇద్దరు నిరూపించారు! యద్దనపూడి వారి రచనలు పదకొండు సినిమాలుగా తీయబడ్డాయి..ముఖ్యంగా మీనా నవల సినిమాగా తీయబడింది…విజయ నిర్మల నటించి, దర్శకత్వం వహించిన ఆ సినిమా లో “మల్లెతీగ వంటిది మగువ జీవితం చల్లని పందిరి ఉంటే అల్లుకు పోతుంది” అనే పాట ను ఆనాటి జనరేషన్ మహిళలు తమకు తాము అన్వహించుకునే వారు!! ఆమె నవల్లోని కలల రాకుమారులు అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు.కృష్ణ సరిగ్గా కథలకు సరిపోయేవారు….దానికి తోడు ఇద్దరు హీరోహిన్ లు భావోద్రేకాలతో త్యాగం అనే సెంటి మెంట్ ను జోడించి కథ గమనాన్ని నడిపేవారు! మానవసంబంధాల్ని, స్త్రీ, పురుష అనుబంధం, మహిళల స్వాభిమానం వంటి అంశాల ఇతివృత్తంగా వినూత్నశైలిలో వచ్చిన యద్దనపూడి నవలలకు తెలుగు నాట నలుచెరల అశేషాభిమానులున్నారన్న సంగతి తెలిసిందే! మధ్యతరగతి అమ్మాయిల ఊహలు, అంతరంగానికి, ఆశలకు, స్వాభిమానానికి యద్దనపూడి నవలలు అద్దంపడతాయని నాటి పాఠకులు భావించేవారు. గృహిణుల్లోనూ పాఠకాశక్తిని పెంపొందించిన ఘనత ఆమెకే దక్కుతుందంటారు!! ఇక కోడూరి కోసల్యాదేవి గారు కూడా కలల రాజకుమారుడిని సృష్టించిన దిట్ట! ఆమె మొదటినవల “చక్రభ్రమణం”ను 1961లో తన 19యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. అంటే ఎంత పాపులారిటీతో ఆనాటి అమ్మాయిల మనసు దోచుకున్నారో ఆ సినిమాలే తార్కాణం! ఇద్దరు హీరోహిన్లలో వాణీశ్రీ, జయప్రద, జయసుధ, శ్రీదేవి అంటే అప్పటి స్ట్రీలలో పెద్ద ఫాలోయింగ్ ఉండేది! వారి పేరు మీద బట్టల కోట్లలో చీరల అమ్మకాలు జరిగేవి!

ఆ తరం అంతరించింది… తరువాత సైకాలజీ, జీవిత విధానాలు బ్రతుకు తెరువు, మనిషిలో భయాలు వీటన్నింటినీ యండమూరి వీరేంద్రనాథ్ గారు, మల్లాది వెంకటకృష్ణ మూర్తి గారు అవపోసనం పట్టారు…ఆనాటి యూత్ ఈ పుస్తకాల కోసం బుక్ షాప్ ల ముందు క్యూ కట్టారు! వీరి నవల నాయకుడు చిరంజీవీ! ఆయనకు జంటగా విజయశాంతి, భాను ప్రియ, మాధవి అప్పటి యూత్ కి డ్రీమ్ గర్ల్స్! 2010 నుండి పాత ట్రెండ్స్ అన్ని పటాపంచాలయిపోయాయి! రీడర్ షిప్ లేదు అంతా టేలిసిరీయల్స్ యుగం వచ్చేసింది…..కార్తీక దీపాలు, మొగలిరేకులు, అగ్నిపూలు, పెళ్లినాటి ప్రమాణాలు…తూర్పు పడమర ఇలా ఈ నాటి యూత్ ట్రెండ్ ను దొరకబుచ్చుకున్నారు! ప్రేమలు…వైపల్యాలు, జలసీలు, అత్తా కోడళ్ల గోడవలు ఇలా సాగుతున్న ట్రెండ్ లో కలల రాజకుమారుడు కనుమరుగయ్యాడు! ‘ఇద్దరు కృష్ణులు’, “ఇష్టమైన వరుడు”, “చెట్టపట్టాలు”, “ఉంటే ఉండు పోతే పో” లాంటి ట్రెండ్ వచ్చేసింది! కాలేజీ అమ్మాయిలు ఈ టేలీ సీరియళ్లకు ఎడిక్ట్ అయ్యి వైవాహిక జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు! ఈ రోజుల్లో ఉహజనీత ప్రపంచం పోయింది కళ్ల ముందే రాజకుమారుడు కారేసుకోని రివ్వున దూసుకువస్తున్నాడు! పబ్బులు..క్లబ్బుల్లో షేరింగ్ డ్రింక్స్ సర్వ సాధారణం అయ్యాయి! పేరెంట్స్ పెంపకం గంగలో కలుస్తుంది! ప్రతి ఇరవై ఏళ్లకు ఇలా ట్రెండ్స్ మారుతూ పోతున్నాయి…2030 నుండి వచ్చే ట్రెండ్ లో మానవ జీవనం లో మధుర ఫలాల మాట దేవుడెరుగు వావి వరుసలు ఉంటాయో లేదో అనే శంఖ ప్రతి వారిని పట్టి పీడిస్తుంది!!