సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు

దిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జులై 1 నుంచి 15 వరకు సీబీఎస్‌ఈ ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసినట్లు సీబీఎస్‌ఈ బోర్డు, కేంద్ర మానవ వనరుల శాఖ సుప్రీంకోర్టుకు తెలిపాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించింది.