మాల్యాను భారత్‌కు అప్పగించనున్న బ్రిటన్

న్యూఢిల్లీ: విజయ్ మాల్యాను భారత్‌కు తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తికావడంతో.. ఏ క్షణమైనా ఆయనను దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ఇవాళ(బుధవారం) తెలిపాయి. తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల్యా గత నెల 14న యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో మాల్యాను రప్పించేందుకు భారత్ అధికారులు రెడీ అవుతున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో ఏ క్షణమైనా తాము మాల్యాని భారత్‌కు తరలించవచ్చు అని ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి మీడియాకు తెలిపారు. విజయ్ మాల్యా యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన తరలింపునకు సంబంధించిన న్యాయప్రక్రియ అంతా పూర్తి చేశాం అని ఆయన చెప్పారు.అయితే ఎప్పుడు తరలిస్తారన్న దానిపై క్లారిటీ రాలేదు.