ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదుల నియామకం

హైదరాబాద్: హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలను వినిపించేందుకు ప్రభుత్వ న్యాయవాదులు( జి పి)గా జె. సుమతీ, వడ్డీ బోయిన సుజాత, తిరుమలశెట్టి కిరణ్ లను నియమించారు. ఈ ముగ్గురి కి సంబంధించి న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి మనోహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి గౌరవ వేతనం నెలకు లక్ష చొప్పున చెల్లిస్తారు ఇటీవల ముగ్గురు (జి పీ) లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.