పౌరాణిక చిత్రానికి దర్శకత్వం..!

విక్షణ సినిమాు, వైవిధ్యమైన, ప్రయోగాత్మక పాత్రకు కేరాఫ్‌.. కంగనా రనౌత్‌. ఓ పక్క కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పార్లల్‌ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల్ని మెప్పించడం ఆమెకే సాధ్యమైంది. అలాగే మహిళా ప్రధాన చిత్రాలకూ కేరాఫ్‌గా నిలిచి అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా మూడు సార్లు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాలనూ దక్కించుకున్న కంగనా అతి త్వరలో పూర్తి స్థాయిలో మెగా ఫోన్‌ పట్టబోతోంది. ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ రాసిన ‘అపరంజిత అయోధ్య’ అనే పౌరానికి కథని కంగనా తన స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ‘మణికర్ణిక’ చిత్రానికి సంబంధించి కొంత భాగాన్ని కంగనా దర్శకత్వం వహించిన విషయం విదితమే. అనాటి మేటి నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన ‘తవైవి’ బయోపిక్‌ త్వరలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.