అర్జున్‌ మేనల్లుడు గుండెపోటుతో మృతి

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మేనల్లుడు, ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా (39) సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బంధువు ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిరంజీవి సర్జా ఇప్పటివరకు 19 సినిమాల్లో నటించారు. 1980 అక్టోబర్‌ 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా తొలి నాళ్లలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటుడిగా మారారు. ఆయన సోదరుడు ధ్రువ సర్జా కన్నడనాట హీరోగా రాణిస్తున్నారు. చిరంజీవి సర్జా రెండేళ్ల క్రితమే నటి మేఘనా రాజ్‌ను పెళ్లి చేసుకున్నారు.
‘‘చిరంజీవి సర్జా ఆకస్మిక మరణం తీవ్రగ్భ్భ్రాంతికి గురిచేసింది. తొలుగులోనే కాకుండా కన్నడలో కూడా మా పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే చిరంజీవి సర్జా హీరోగా చైతన్య దర్శకత్వంలో మేము నిర్మించిన ‘ఆద్య’ చిత్రం ఈ ఏడాది శివరాత్రి పర్వదినాన విడుదలై హీరోకి, మా సంస్థకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ జ్ఞాపకాల నుంచి తేరుకోకముందే ఆయన మరణ వార్త మా మనసుల్ని కలచి వేసింది. సర్జా ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మా సంస్థ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ – నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌