మహామండపం ద్వారానే దర్శనం

విజయవాడ: ఈ నెల 10 నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని విజయవాడ దుర్గమ్మ గుడి ఈవో సురేశ్‌ బాబు తెలిపారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ సోమినాయుడు, ఈవో విలేకర్లతో మాట్లాడారు. రూ.300 టికెట్లు రద్దు చేశామని, తీర్థాలు, శఠగోపాలు ఉండవని ఛైర్మన్ చెప్పారు. ప్రసాదాలు నేరుగా ప్యాకెట్ల రూపంలో భక్తులకు ఇస్తామన్నారు. రేపు, ఎల్లుండి దర్శనాల ట్రయల్‌ రన్‌ ఉంటుందని ఈవో పేర్కొన్నారు. మహామండపం ద్వారానే దర్శనం చేసుకుని కిందకు రావాలని సూచించారు. భక్తులు సూచనలు పాటిస్తూ ఆలయ అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఈవో సురేశ్‌ బాబు విజ్ఞప్తి చేశారు.