బ్లాక్ మెయిలింగ్ చేయుటకు ప్రయత్నించిన ఏడుగురు అరెస్టు

గుంటూరు: ఇటీవల యువతి నగ్న చిత్రాలు ఇంస్టాగ్రామ్ నందు ఐ యామ్ 420 అను ఫేక్ అకౌంట్ తో ఆమెకు పంపి, బ్లాక్ మెయిలింగ్ చేయుటకు ప్రయత్నించిన వారితో పాటు, వారికి వివిధ రకాలుగా సహకరించిన మొత్తం ఏడుగురు పైన గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో అర్బన్ దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పి ఎ లక్ష్మీనారాయణ ఈరోజు పక్కగా సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించి, వారిని అరెస్టు చేసి, మహిళలపై ఇలాంటి నేరాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకుండా ఉండడానికి ఆస్కారం లేదని, గుంటూరు అర్బన్ పోలీసులు రూడీ చేశారు. ఈ కేసులో ప్రేమ పేరుతో వంచించి, బాధిత యువతి నగ్న చిత్రాలు చిత్రీకరించిన వరుణ్ మరియు వాటిని అంతర్జాలంలో ఉంచిన కౌశిక్ లను ఇరువురిని ది.27-06-20 వ తేదీన గుంటూరు అర్బన్ పోలీస్ కటకటాల వెనక్కి పంపడం జరిగింది. ఆ యువతి యొక్క నగ్న చిత్రాలను ఇటీవల ఇంస్టాగ్రామ్ నందు ఐ యామ్ 420 అను ఫేక్ ఎకౌంటుతో ఆమెకు పంపడంతో ఈ వ్యవహారము వెలుగులోకి రావడం తెలిసిన విషయమే. ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపిన వారి గురించి గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో గుంటూరు అర్బన్ దిశా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ లక్ష్మీనారాయణ గారు అర్బన్ టెక్నికల్ అనాలసిస్ టీం ఇంచార్జి విశ్వనాథరెడ్డి మరియు వారి బృందం సభ్యుల సహకారంతో పక్కాగా సాంకేతిక సాక్ష్యాధారాలను సేకరించడం, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ లు కోటయ్య, బాజీ బాబు మరియు సిబ్బంది సహకారంతో ఏడుగురు ముద్దాయిలను ఈరోజు అరెస్టు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న కౌశిక్ ద్వారా సదరు యువతి నగ్న చిత్రాలు భాస్కర్ అను నతనికి, అతని ద్వారా ధనంజయ రెడ్డికి, అతని ద్వారా తులసి కృష్ణ, మణికంఠలకు అక్కడ నుండి కేశవ్, క్రాంతి కిరణ్ లకు అక్కడనుండి రోహిత్ లకు రావడం, వీరిలో మణికంఠ, ధనుంజయ్ రెడ్డిలు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ యువతికి పంపి, వాటితో ఆమెను బెదిరించి అనుభవించాలని, తదుపరి మిగిలిన ఐదుగురుతో విషయాలు పంచుకోగా వీరి తర్వాత మిగిలిన ఈ ఐదుగురు కూడా ఆమెను అనుభవించాలి అనే తప్పుడు కోరికతో, వివిధ రకాలుగా వారి సహకారం పొంది, మణికంఠ nenu420 (ఐ యాం ఫోర్ ట్వంటీ) పాస్ వార్డ్: naalochana190 (నా ఆలోచన 190 ) అను ఫేక్ అకౌంట్ రూపొందించి ఇంస్టాగ్రామ్ ద్వారా ఆ యువతికి చెందిన నగ్న చిత్రాలు తనకు రాబడిన వాటిని ఆమెకు పంపి, చాట్ చేయటం జరిగింది. ఆ యువతి వారి ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో, 50 వేల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించటం జరిగింది. దానికి ఆ యువతి బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపాల్సిందిగా అడగటంతో, ముద్దాయిలు దొరికిపోతామన్న ఉద్దేశంతో మిన్నకుండి పోయారు. అనంతరం ఆయువతి ధైర్యం చేసి, పోలీసువారి దృష్టికి జరిగిన విషయాలు తీసుకుని రావడం, దరిమిలా పోలీసు వారు ఈ కేసులోని ముద్దాయిలు అందర్నీ పక్క సాంకేతిక సాక్ష్యాధారాలతో పోవడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్., గారు మాట్లాడుతూ, స్కూల్స్ మరియు కాలేజీలలో చదువుకునే విద్యార్థినీ / విద్యార్థులు, ఇతర యువతీ యువకులు టెక్నాలజీని ఉపయోగించే విషయంలోనూ, ప్రేమల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పుడు మార్గాల లోనికి వెళ్లి తమ బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసు కోవద్దని, ఎవరు గుర్తించరులే అన్న ఉద్దేశంతో ఫేక్ నంబర్ల ద్వారా, ఫేక్ అకౌంట్స్ ద్వారా ఇతరులకు చేసే తప్పుడు మెసేజీలు / పోస్టింగ్స్ ను గుర్తించడం తప్పనిసరిగా జరుగుతుందని, కనుక ఇలాంటి తప్పిదాలకు దూరంగా ఉండి, సన్మార్గంలో తమ భవిష్యత్తును తీర్చిదిద్దు కోవాలని, అని అదేవిధంగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల యాజమాన్యాలు బాధ్యత తీసుకొని వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియ జేశారు. ఈ విధమైన కేసులలో ముద్దాయిలుగా ఉన్న వారి పైన నిఘా కొనసాగుతుందని, ఈ విధమైన కేసులలో ఉన్న వారి పైన చట్టబద్ధంగా రౌడీషీట్లు మొదలైన వాటిని ఏర్పాటు చేయడం జరుగు తుందని, అలాంటి పరిస్థితి ఎవరూ తెచ్చుకో వద్దని అర్బన్ ఎస్పి ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్., గారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పరిపాలన విభాగం అదనపు ఎస్పీ డి గంగాధరం, స్పెషల్ బ్రాంచ్ డి ఎస్ పి బాల సుందర రావు, దిశ మహిళా పోలీస్స్టేషన్ డిఎస్పి ఎ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కోటయ్య, బాజీ బాబు తదితర సిబ్బంది మరియు టెక్నికల్ అనాలసిస్ వింగ్ ఎస్ఐ విశ్వనాథరెడ్డి గార్లు పాల్గొన్నారు.