అపర చాణక్యుడు

రాజకీయాలలో రాణించిన మహా నేత
ప్రజాసేవ కి అంకితమైన రాజకీయవేత్త!!
నిజాం పాలన ను ఎదిరించావు
వందేమాతరం గీతం పాడి సస్పెండ్ అయ్యావు
“లా”. పరీక్షలో సర్వ ప్రధము డి వ య్యావు
ఉత్తమ విద్యార్ధి గా పేరు తెచ్చుకున్నావు!
కాకతీయ పత్రిక నడపడం లో ముందున్నావు
సాహిత్య సాంస్కృతిక రంగాలలో ను ఉన్నావు
పేదలకు స్వంత భూమి ను పంచి మేలు చేశావు
భూసంస్కరణల చట్టాన్నీ అమలు జరిపావు!
జైళ్ళ శాఖ లో సంస్కరణలు తీసుకొచ్చావు
బలహీన వర్గాల ప్రగతి కి నడుం కట్టా వు
పార్టీ ఆశయాలకు కట్టుబడి పని చేశావు
పార్టీ ని బలోపేతం చెయ్యడం లో కృషి చేశావు
కుటిల రాజకీయాలను వ్యతి రేకించావు
వర్గాలకు అతీతంగా నడచు కున్నావు
ఏ పదవి లో ఉన్న చిత్తశుద్ది తో శ్రమించా వు
ఏ స్థాయి లో ఉన్న దేశం గురించే ఆలోచించావు
స్థిత ప్రజ్ఞ” బిరుదు ను సార్ధకం చేశావు
లోపలి మనిషి” గా సాహిత్యం లో నిలిచావు
వేయి పడగల అనువాదం తో పేరు పొందావు
రచనా వ్యాసంగం లోచెరగని ముద్ర వేశా వు
ఆర్థిక రంగాన్ని అన్ని విధాల ఆదుకున్నావు
ప్రధానిగా దేశాభివృద్ధికి పాటు పడ్డావు
రచన
Dr గిడ్డి వెంకట రమణ
సామాజిక శాస్త్ర ఆచార్యులు
శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం అనంతపురం
చర వాణి 9440984416