ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్..

అమరావతి: ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్వే హోటల్లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. విద్యార్థులు హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్లైన్లోనే విడుదల చేసింది.